దూదేకుల సమాజ అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
యువతకు సబ్సిడీ రుణాలు, విద్యా–ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణ ముస్లిం దూదేకుల సంఘం యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పాషా డిమాండ్ గరిడేపల్లి, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడిన దూదేకుల (పింజారి, నూబాఫ్, లడఫ్) ముస్లిం మైనారిటీ ఉపకులాల అభ్యున్నతికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముస్లిం దూదేకుల సంఘం యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పాషా డిమాండ్ చేశారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన దూదేకుల సమాజం నేటికీ అనేక ప్రాంతాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక...