రైతులకు శుభవార్త.. ఇక స్థానికంగానే ధాన్యం విక్రయాలు
కీతవారిగూడెంలోనే మిర్యాలగూడ మార్కెట్ ధర.. రవాణా ఖర్చులకు విముక్తి ట్రాక్టర్ల కోసం గంటల తరబడి నిరీక్షణకు చెక్.. 10–15 నిమిషాల్లోనే అన్లోడింగ్ కీతవారిగూడెం, ప్రజానేస్తం జ్వాల : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులకు కొంత ఉపశమనం కలగనుంది. ధాన్యం విక్రయాల కోసం మిర్యాలగూడ, హుజూర్నగర్ మార్కెట్లకు వెళ్లి రవాణా ఖర్చులు భరించడంతో పాటు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితికి ప్రత్యామ్నాయంగా కీతవారిగూడెం సమీపంలోనే ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. సర్వారం రోడ్డులోని శ్రీ శ్రీనివాస స్టోన్ క్రషర్ మిల్లులో నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.** మిర్యాలగూడ మార్కెట్ ధరల ప్రకారం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం...