ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలి
ప్రతి గ్రామంలో నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీకి ఉపాధి అవకాశాలు కల్పించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు: రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వనరులను సంరక్షిస్తూ, ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందేలా చూడాలని సూచించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు,...