ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆరుగురి అరెస్ట్

తప్పుడు అండర్‌టేకింగ్‌తో రూ.కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్ రూ.1.30 కోట్ల ఫైనాన్స్ కోసం పక్కా పథకం.. సీఐ వెల్లడి హుజూర్‌నగర్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వం దశాబ్దాల క్రితమే భూసేకరణ చేసి పరిహారం చెల్లించిన భూములను తిరిగి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో హుజూర్‌నగర్ పోలీసులు ఆరుగురిపై చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందించి, తప్పుడు అండర్‌టేకింగ్ సమర్పించి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఆరుగురి అరెస్టు వివరాలను సీఐ వెల్లడించినట్లు సమాచారం. 1971లోనే భూసేకరణ.. రికార్డుల్లో మాత్రం పట్టా పోలీసుల వివరాల ప్రకారం.....