త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌లో ప్రక్రియ పూర్తికాగానే జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపు హైదరాబాద్‌, నవంబర్‌ 11 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్‌లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రిని కలిసింది....