హనుమకొండ కలెక్టరేట్లో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు
హనుమకొండ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యా వ్యవస్థ ఆధునీకరణకు, విద్యారంగ అభివృద్ధికి...