వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 10+2 విద్యా విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హనుమకొండ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేస్తూ విద్యా విధానాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. ప్రతిపాదిత విధానం ప్రకారం నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్య, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్య కొనసాగనుంది. ఈ మార్పుల...