మిర్యాలగూడలో సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం: గంగుల అంజలి యాదవ్
మిర్యాలగూడ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): మిర్యాలగూడ పట్టణంలో త్వరలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనాన్ని యాదవ సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గంగుల అంజలి యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని యాదవ సంఘ భవనంలో సదర్ ఉత్సవానికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల అంజలి యాదవ్ మాట్లాడుతూ.. యాదవుల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెప్పే సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సదర్ సమ్మేళనానికి యాదవ సోదరులు, సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ వెల్ఫేర్ సంఘం...