విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి

హుజూర్‌నగర్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): ఆధునిక భారత విద్యారంగానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ స్థానిక గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ బచ్చు రామారావు, మాజీ సర్పంచ్ గొట్టే రామయ్య,...