కొమురం భీమ్ మనుమడు భీంరావ్ మృతి

సిర్పూర్ (యు), నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): కొమురం భీమ్ రెండో మనుమడు, సోనేరావ్ వాలా తమ్ముడు భీంరావ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో కొమురం భీమ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం జైనూర్‌లో ఆటో, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో భీంరావ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో రాత్రి చికిత్స పొందుతూ భీంరావ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొమురం భీమ్ వంశానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర...