భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

కాగజ్‌నగర్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): భార్య కాపురానికి తిరిగి రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం బలగల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బలగల గ్రామానికి చెందిన గౌరవయ్య (40) భార్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి కాపురానికి రాకపోవడంతో అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాగజ్‌నగర్ ఎస్సై సందీప్ తెలిపారు.