టిప్పర్ ఢీకొని వివాహిత దుర్మరణం

భర్త కళ్ల ముందే ఘోర ప్రమాదం.. ఇద్దరు కుమారులకు తీరని విషాదం నేరేడుచర్ల (ప్రజానేస్తం జ్వాల): అతివేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వివాహిత అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన నేరేడుచర్ల వద్ద చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామానికి చెందిన బొమ్మిని సూరమ్మ (40), తన భర్త వెంకన్నతో కలిసి చిలక జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి హుజూర్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా నేరేడుచర్ల వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ...