రహదారిపై గుంతలు పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు
సూర్యాపేట, నవంబర్ 11 (ప్రజా నేస్తం జ్వాల): సూర్యాపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారి-65పై ఈనాడు ఆఫీస్ జంక్షన్ వద్ద రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారడంతో ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం ట్రాఫిక్ పోలీసులు గుంతలను పూడ్చివేయించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు రహదారులపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకొని నిదానంగా వాహనాలు నడపాలని సూచించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి...