పేద విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులకు ఎస్టీయూ ఆర్థిక సహాయం
రాయనిగూడెం, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల: ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత అని, ఉపాధ్యాయ సంఘాల కృషితోనే పాఠశాలలకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు బూట్లు, సాక్సులు వంటి సౌకర్యాలు అందుతున్నాయని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ అన్నారు. బుధవారం రాయనిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ సంఘం, ప్రాణక్ హీలింగ్ యోగ సంస్థ సంయుక్త సహకారంతో 22 మంది పదో తరగతి విద్యార్థులకు రూ.5,500 పరీక్ష ఫీజును నగదు రూపంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా సదానందం గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బలహీన వర్గాల విద్యార్థులకు దాతల సహకారంతో 8 పాఠశాలల్లోని 250 మంది...