విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన
పాలెం పాఠశాలలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం బిజినపల్లి, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నిహారిక ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, చట్టాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్ ఆర్య సైతం కార్యక్రమంలో పాల్గొని సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన...