హుజూర్నగర్ మున్సిపాలిటీలో ముసలం!
రూ.6 కోట్ల నిధుల లెక్కలపై కౌన్సిలర్ల సమరభేరి! బల్లలు గుద్ది అధికారులను నిలదీసిన మహిళా కౌన్సిలర్లు తమపై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కౌన్సిల్ హాల్ బయటే మీడియా.. అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం హుజూర్నగర్: హుజూర్నగర్ మున్సిపాలిటీలో పాలనాపరమైన వివాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిపై చర్చించాల్సిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిరసనలు, వాగ్వాదాలతో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సుమారు రూ.6 కోట్ల నిధుల ఖర్చుపై లెక్కలు చెప్పాలంటూ మహిళా కౌన్సిలర్లు పట్టుబట్టడం, తమపై చేసిన ఫిర్యాదులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం, మరోవైపు మీడియాకు సమావేశంలోకి అనుమతి నిరాకరించడం.. ఇలా వరుస పరిణామాలతో...