ఘనంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ 2వ వార్షికోత్సవ వేడుకలు – 30 ప్రధాన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జాతీయ స్థాయి ధర్నా నిర్వహణకు నిర్ణయం.
హైదరాబాద్, నవంబర్ 9: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండవ వార్షికోత్సవ వేడుకలను నవంబర్ 9, 2026న హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ హాజరయ్యారు. జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దేశాల భూపాల్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకతను తెలుసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిందని, ప్రతి పౌరుడు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన...