ఘనంగా సమాచార హక్కు సాధన కమిటీ 2వ ఆవిర్భావ దినోత్సవం

ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం, అవినీతి రహిత పాలనకు బాటలు వేయడమే లక్ష్యంగా సమాచార హక్కు సాధన కమిటీ పని చేస్తోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు తోట సురేష్ పేర్కొన్నారు. సమాచార హక్కు సాధన కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ​ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోట సురేష్ మాట్లాడుతూ, సామాన్య పౌరునికి రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధం సమాచార హక్కు చట్టం (RTI) అని తెలిపారు. పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కమిటీ అలుపెరగని పోరాటం చేస్తోందని వివరించారు. సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ దిశానిర్దేశంలో దేశవ్యాప్తంగా...