పేదల సొంతింట కలకు సాకారం.. ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి వెలుగులు..
ముఖ్యమైన పాయింట్స్:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం – మంత్రి పొన్నం ప్రభాకర్...మొదటి దశలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు చిదురాల రమ నూతన గృహంలో నిర్వహించిన తొలి దీపావళి వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ దంపతులకు నూతన వస్త్రాలు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి టపాసులు కాల్చి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి...