సమాచార హక్కు చట్టానికి తూట్లు. ములుగు జిల్లాలో బరితెగించిన యంత్రాంగం! సుమారు 2 నెలల గడువు దాటింది.. ఫస్ట్ అప్పీల్ ఆర్డర్ ఇచ్చినా లెక్కచేయని అధికారులు! "మేము డాక్యుమెంట్స్ ఇవ్వలేము, మీరే ఆఫీస్‌కి వచ్చి చెక్ చేసుకోండి" అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం

వెంకటాపూర్, (ప్రజానేస్తం జ్వాల): ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు మూలస్తంభమైన సమాచార హక్కు చట్టం (RTI Act 2005) కు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో తీవ్ర విఘాతం కలుగుతోంది. చట్టం నిర్దేశించిన 30 రోజుల గడువు ముగిసినా సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసిన అధికారులు, చివరకు ప్రథమ అప్పీల్ అథారిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పెడచెవన పెడుతున్నారు. ఉన్నతాధికారిచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా, రికార్డులను ఇవ్వలేమని చెబుతూ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1. అసలు ఏం జరిగింది? - ఆర్టీఐ దరఖాస్తు మరియు అప్పీలు వివరాలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలోని...