బాలసముద్రంలో భారీగా అక్రమ ఔషధ నిల్వలు స్వాధీనం
హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో డ్రగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్న స్థావరంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.15 లక్షల విలువైన వివిధ రకాల ఔషధ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బాలసముద్రంలోని ఓ నివాస గృహాన్ని అక్రమ మందుల నిల్వ, విక్రయ కేంద్రంగా వినియోగిస్తున్నట్లు ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో స్పందించిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు సంబంధిత నివాస గృహంపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ...