*జి.కె. అన్నారంలో ఇంటింటికీ దీపావళి సంబరాలు*

*గ్రామంలో పర్యటించి ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ బి. చంద్రశేఖర్* నల్గొండ, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): నల్గొండ మండలంలోని జి.కె. అన్నారం గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ దీపావళి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి పెర్ల లక్ష్మమ్మ, నలపరాజు ముత్తమ్మ, సూడి రెడ్డి రంజిత, గోపిడి పద్మమ్మ ఇళ్లలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి పండుగ సంబరాల్లో పాలుపంచుకున్న కలెక్టర్ వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవీఏహెచ్‌ఓ, పీడీ హౌసింగ్, నల్గొండ ఎంపీడీఓ, స్థానిక సర్పంచ్,...