ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణం
400 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం.. జాతీయ పోటీలకు తెలంగాణ తరఫున ఎంపిక హనుమకొండ: ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి గంగారపు ప్రభుదేవ్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. ఖమ్మంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) రాష్ట్రస్థాయి పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో నవంబర్ 11 నుంచి మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 400 మీటర్ల పరుగు పందెంతో పాటు 400 మీటర్ల రిలే విభాగంలోనూ రాష్ట్రానికి ప్రాతినిధ్యం...