ఆసిఫాబాద్‌లో మూడు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు

ఆసిఫాబాద్, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 15వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా బిన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సీఐ నీలం రవి సంయుక్తంగా ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. దస్నాపూర్–కోర్టు రోడ్డు జంక్షన్, బెజ్జూర్ సూపర్ మార్కెట్ ఎదుట, కలెక్టరేట్ రోడ్డులోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.