సెల్ఫోన్లకు దూరంగా ఉండి.. క్రీడల వైపు అడుగులు వేయాలి
నల్గొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు సెల్ఫోన్ల వినియోగాన్ని తగ్గించి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో కలెక్టర్ ఎలెవన్, ఎస్పీ ఎలెవన్ జట్ల మధ్య నిర్వహించిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌ను కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్‌ను వీక్షించారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీలో ఎస్పీ ఎలెవన్ జట్టు 118 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....