యువత మెలుకో...

యువత .................. కాలేజీ రోజులంటే షికార్లకే కాదు... స్వప్నాలకు రెక్కలు తొడిగే కాలం. పుకార్ల వెంట పరుగెత్తకండి... మద్యానికి, గంజాయికి చెడు వ్యసనాలకు బానిసలై మీ భవిష్యత్తును బూడిద చేయకండి. అమ్మా... నాన్నా... తమ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి, ఎండనకా... వాననకా... కాయకష్టం చేస్తూ మీ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ముదుసలి వయసులో మీ చేత నాలుగు మెతుకులు తినాలన్నది వారి ఆశ కాదు... “మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు” అన్నదే వారి తాపత్రయం. ప్రేమ పేరుతో కాలాన్ని వృథా చేయకండి... మీ కలలను కాలగర్భంలో కలపకండి. పుస్తకాన్ని తోడుగా చేసుకోండి... జ్ఞానాన్ని ఆయుధంగా మలచుకోండి... ఉన్నత విద్యను అభ్యసించి సమాజ...