33 ఫార్మా కంపెనీల కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు33 ఫార్మా కంపెనీల కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు

కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలి.. గోసుకొండ వెంకటేష్ డిమాండ్ చౌటుప్పల్, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 33 ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం, పంటలు, భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు గోసుకొండ వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య సమస్యపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో 33 ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చినా, కాలుష్య నియంత్రణపై తగిన పర్యవేక్షణ లేదని విమర్శించారు....