రావిర్యాలలో 22ఏ భూముల వ్యవహారంపై వివాదం

రూ.91 లక్షలకు రిజిస్ట్రేషన్.. ఆ తర్వాత భూమి విలువలో భారీ మార్పులు రెవెన్యూ అధికారుల తీరుపై బాధితుల అభ్యంతరాలు.. రాజకీయ ప్రమేయంపై అనుమానాలు రంగారెడ్డి జిల్లా, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల ప్రత్యేక కథనం): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 8 భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించి రిజిస్ట్రేషన్లు చేయడం, అనంతరం మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చడం, మార్కెట్ విలువలను పలుమార్లు మార్చడం వంటి పరిణామాలు రెవెన్యూ శాఖలో చర్చకు దారితీశాయి. రికార్డుల్లో కనిపిస్తున్న వివరాలు: సర్వే నంబర్ 8/5లోని 2.31 ఎకరాల భూమికి ఎకరాకు రూ.91 లక్షల మార్కెట్ విలువతో...