కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో టాలెంట్ టెస్ట్.. టాప్‌-10 విద్యార్థులకు బహుమతులు

కొంపల్లి, నవంబర్ 06 (ప్రజానేస్తం జ్వాల): కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు HELP TO NEEDY GROUP ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, చదువుపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షలో 60 శాతానికి పైగా మార్కులు సాధించి టాప్‌-10 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ALL IN ONE పుస్తకాలను బహుమతులుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత పిన్నింటి మాధవరావు (JPA, KTPP) పుస్తకాలను అందించడంతో పాటు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థి ఉన్నత విద్యకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొంగ సోమేశ్వర్ (AE, KTPP), కొంపల్లి గ్రామ సర్పంచ్...