ఆరేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం!

వరంగల్, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరేపల్లి ప్రాంతంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు మహబూబాబాద్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఏనుమాముల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.