బాణసంచా దుకాణాల వద్ద భద్రతా లోపాలకు తావివ్వొద్దు!
హుజూర్నగర్, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): దీపావళి పండుగ నేపథ్యంలో హుజూర్నగర్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న బాణసంచా దుకాణాల వద్ద భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ అధికారులను కోరారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ సతీష్, ఫైర్ ఆఫీసర్ సుబ్బరామిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ యాదగిరికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణసంచా దుకాణాలకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి చేయాలని, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు, నివాసాల మధ్య ఏర్పాటు చేసిన దుకాణాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు....