ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి

సూర్యాపేట, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా జిల్లాల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. విద్య, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అభివృద్ధి లక్ష్యాల పురోగతిపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ బి. హరి సింగ్ తదితర అధికారులు...