పిల్లల అభిప్రాయాలకు పెద్దపీట.. చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా సూర్యాపేట!
సూర్యాపేట, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): పిల్లల అభిప్రాయాలు, అవసరాలు, సమస్యలను గుర్తించి వారికి సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో సూర్యాపేట జిల్లాను చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యూనిసెఫ్ సహకారంతో నిర్వహించిన ‘లిజనింగ్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల మంది విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలోని 100 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు...