ప్రయోగాలతో విద్యకు ప్రాణం.. ఇంజనీరింగ్ ల్యాబ్‌లను సందర్శించిన పాఠశాల విద్యార్థులు

భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): పుస్తకాల్లో చదివిన విద్యను ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడే విద్యార్థులకు అంశాలపై సంపూర్ణ అవగాహన కలుగుతుందని కమల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శంకర్ అన్నారు. సింగాపురంలోని కమల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో గట్ల నర్సింగాపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు కళాశాల ప్రయోగశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శంకర్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న శాస్త్రీయ అంశాలను ఉన్నత విద్యలో ప్రయోగాల ద్వారా మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి సందర్శనలు విద్యార్థుల్లో నూతన విషయాలపై ఆసక్తిని, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనను...