ముల్కనూర్‌లో నేడే సదర్ మహోత్సవం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో తొలిసారిగా సదర్ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు భీమదేవరపల్లి శ్రీకృష్ణ యాదవ నాయకులు జక్కుల అనిల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవుల సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలిచే సదర్ మహోత్సవాన్ని ముల్కనూర్‌లో నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. సదర్ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, యాదవ సంఘాల నాయకులు, కుల పెద్దలు...