సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): జిల్లాలో విద్య, వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఐదు అంతస్తుల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతం చేసి రెండు, మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్బీఐ, ఐఓసీ, కోటక్ మహీంద్రా, అక్షర ఫౌండేషన్ సహకారంతో రూ.1.17 కోట్ల అంచనా...