స్కానింగ్ కేంద్రాల్లో పీసీపీఎన్డీటీ చట్టం అమలు తప్పనిసరి
హనుమకొండ, నవంబర్ 06 (ప్రజానేస్తం జ్వాల): పీసీపీఎన్డీటీ చట్ట నిబంధనలను స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజిత స్పష్టం చేశారు. చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు హనుమకొండలోని పలు స్కానింగ్ కేంద్రాలను డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులు, ఫారమ్-ఎఫ్, స్కానింగ్ యంత్రాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. చట్ట ప్రకారం అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు. ప్రతి స్కానింగ్ కేంద్రం రోజువారీ వివరాలను ఎప్పటికప్పుడు...