*పోక్సో కేసులో నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష*

హనుమకొండ, నవంబర్‌ 06 (ప్రజానేస్తం జ్వాల): మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి వరంగల్ ప్రత్యేక సెషన్స్ కోర్టు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. సంతగల్లు నాయుడు అలియాస్ సిద్ధార్థ్ (21) అనే యువకుడిపై 2023లో నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన వరంగల్ ప్రత్యేక సెషన్స్...