త్వరలో ప్రారంభం కానున్న రామస్వామిగుట్ట ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ కాలనీ
2,160 ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన.. మిగిలిన పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం సూర్యాపేట, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామిగుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి కాలనీని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు, గ్రీనరీ, తాగునీటి వసతి, పైలాన్ స్తూపం, సభాస్థలి తదితర అభివృద్ధి పనులను సమీక్షించారు. మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో...