రోడ్లపై ధాన్యం కుప్పలు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం!
ముఖ్యమైన పాయింట్స్:రోడ్లపై ధాన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం!గత ప్రమాదాల నుంచి గుణపాఠం లేదా?రైతులకు సౌకర్యాలేవి?ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి! ఏటా ప్రమాదాలు జరుగుతున్నా మారని పరిస్థితి.. రైతులకు ప్రత్యామ్నాయ కల్లాలు ఎక్కడ? ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలి.. ప్రజల డిమాండ్ నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల) ప్రత్యేక కథనం: వరి కోతల సీజన్ ప్రారంభమైంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరైన స్థలాలు లేక రహదారులనే కల్లాలుగా మార్చుకుంటున్నారు. గ్రామీణ రహదారుల నుంచి ప్రధాన రహదారుల వరకు ధాన్యం కుప్పలు దర్శనమిస్తుండటంతో వాహనదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ధాన్యం కుప్పలు, రోడ్లపై ఆక్రమణలు ప్రమాదాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. ఏటా ఇదే...