ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ హరిత క్షేత్రస్థాయి తనిఖీ

ఆసిఫాబాద్, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గోదాం వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని, నిబంధనల ప్రకారం అన్ని భద్రతా చర్యలు అమలులో ఉండాలని పేర్కొన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ హరిత సందర్శించారు. ఈ సందర్భంగా గోదాం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీలింగ్ వ్యవస్థను పరిశీలించారు. గోదాం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్ల...