లట్టుపల్లి–మాదన్నపేట డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం

గ్రామానికి చేరుకుని రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): లట్టుపల్లి నుంచి మాదన్నపేట వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించడంతో గ్రామస్తుల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి లట్టుపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, గ్రామ పరిధిలో సుమారు ఒక అడుగు ఎత్తులో కాంక్రీట్‌ పనులు చేపట్టాలని సూచించినట్లు స్థానికులు తెలిపారు. డబుల్‌ రోడ్డు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లట్టుపల్లి ఉమ్మడి తండాల సర్పంచులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు....