అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన బాణాసంచా సీజ్‌

హుజూర్‌నగర్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ పట్టణంలో అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వ ఉంచిన దుకాణంపై రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, సుమారు రూ.20 వేల విలువైన దీపావళి బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఫ్యాన్సీ జనరల్‌ స్టోర్స్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణంలో బాణాసంచా నిల్వ చేసేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండానే బాణాసంచా నిల్వ ఉంచినట్లు గుర్తించిన అధికారులు, అక్కడ ఉన్న సుమారు రూ.20 వేల విలువైన దీపావళి మందులను సీజ్‌ చేశారు. బాణాసంచా నిల్వ, విక్రయాల...