బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఆశావహుడు భిక్షం గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ

ఒకవైపు బీజేపీ టికెట్ ప్రయత్నాలు.. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో సమావేశం హైదరాబాద్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్న భిక్షం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ టికెట్ కోసం బీజేపీలో ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న భిక్షం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు...