*ఎన్నికల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి*

హైదరాబాద్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రంలో వివిధ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి కోరారు. తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలు–2023, లోక్‌సభ ఎన్నికలు–2024 సందర్భంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు చేసిన అదనపు ఖర్చులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన బడ్జెట్ సరిపోకపోవడంతో పలు అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అదనపు ఖర్చులు చేయాల్సి వచ్చిందని లచ్చిరెడ్డి తెలిపారు....