ఆగి ఉన్న ట్రాక్టర్లను ఢీకొన్న కారు
భీమదేవరపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ స్టేజ్ సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన గడ్డి కట్టలతో నిలిపి ఉంచిన ట్రాక్టర్లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారిపై గట్లనర్సింగాపూర్ స్టేజ్ సమీపంలో గడ్డి కట్టలతో కూడిన ట్రాక్టర్లు రోడ్డుపక్కన నిలిపి ఉన్నాయి. అదే సమయంలో హుస్నాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్లను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. రహదారి భద్రతపై ఆందోళన ఈ...