టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి భేటీ!

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృతంగా కృషి చేస్తూ, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మహేష్ కుమార్ గౌడ్ వారికి సూచించారు. అనంతరం పద్మశాలి కుల సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో గుండు సుధారాణి పాల్గొన్నారు.