సుబేదారిలోని ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్!

హనుమకొండ సుబేదారిలోని ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం నెలవారీ తనిఖీల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదాం సీల్స్, భద్రతా ఏర్పాట్లు, పరిసరాల నిర్వహణతో పాటు సీసీటీవీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈవీఎంల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించారు.