సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెసర నారాయణ మృతి

పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి: సీపీఐ నాయకులు ధర్మసాగర్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన సీపీఐ గ్రామ శాఖ కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెసర నారాయణ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. నారాయణ మృతి విషయం తెలుసుకున్న ధర్మసాగర్ మండల సీపీఐ కోశాధికారి, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజారపు రత్నం, మండల సీనియర్ నాయకుడు డోకి రాజన్న తదితరులు గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహంపై పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు...