తాగునీటి ఎద్దడికి ముందస్తు కట్టడి.. గ్రామాల వారీగా కార్యాచరణ!
వాటర్ స్ట్రెస్ గ్రామాలను నవంబర్లోనే గుర్తించాలి.. వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు 15 రోజుల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను నవంబర్లోనే గుర్తించి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, వారం రోజుల్లో గ్రామాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో...